భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం ద్వారకానగర్ ప్రాంతంలో అగ్రహారపు సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నేడు భవన నిర్మాణ రంగంలోని కార్మికులు దారుణమైన దుస్తితిలో ఉన్నారనీ దీనికి కారణం నేటి ప్రభుత్వ నిర్ణయాలే అని విమర్శించారు. లోకం మొత్తం వీరి పరిస్థితిపై విచారాన్ని ప్రకటిస్తూ ఉంటే పాలకులు మాత్రం దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. పోనీ జగనన్న ఇళ్ళు పధకంలో నిర్మాణ పనులు ఊపందుకుంటే కనీసం దానిలో అయినా పనులు దొరుకుతాయని ఆశపడితే ఆ పధకం కూడా నత్త నడకే సాగుతోందన్నారు. పోనీ వెరే ఏదన్నా కూలీపనులకి వలస పోదామంటే ఏదీ కూడా అతీ గతీ లేని వైనం చూస్తున్నామనీ చెప్పుకుని వాపోతున్నారన్నారు. వీటన్నిటికీ ఒకటే సమాధానమనీ వచ్చే ఎన్నికలలో ఈప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకోడమే అనీ దీనికి మద్దతు ఇయ్యవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్, దుర్గ, నగేష్, వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.