పింఛనుదారులను మోసం చేసిన జగన్ రెడ్డి

నంద్యాల, అధికారంలోకి రాగానే ఇస్తానన్న 3000 పించను దిగిపోయే ముందు ఇచ్చి పింఛనుదారులను మోసం చేసిన జగన్ రెడ్డి అని విమర్శించిన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు. వృద్ధులకు, వితంతువులకు మరియు వికలాంగులకు 4వ తారీకు అవుతున్నా కానీ అందని పింఛన్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే జగన్ రెడ్డి పింఛనుదారులను కూడా మోసం చేశాడని అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 పెంచుతూ ఎన్నికలను దగ్గర చేసుకుని పెన్షన్ 3000 ఇచ్చి వృద్ధులను వితంతువులను వికలాంగులను మోసం చేశాడని నంద్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశం ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3000 ఇస్తానంటే ప్రజలు నమ్మి ఓట్లేసారని తీరా నాలుగున్నర ఏళ్ల తరువాత మూడు నెలల ముందుగా పెన్షన్లను 3000 చేసి మరోసారి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జగన్ ఇస్తానన్న 3 వేల రూపాయల పెన్షన్ దఫ దఫాలుగా పెంచుతూ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగున్నరేళ్ల కాలం పట్టిందని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పెన్షన్ లబ్ధిదారులు ఒక్కరికి 18 వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బకాయి పడ్డాడని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.కేవలం పెన్షన్ పెంచుతున్నాము అన్న మాట చెప్పడానికి కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన వాటికి పేర్లు మార్చి రంగులు వేసుకుని ప్రారంభించడం తప్ప వైసిపి ప్రభుత్వం నిర్మించినవి ఏమి లేవని గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో 120 పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని ఎటువంటి అభివృద్ధి ప్రకటన చేయకుండా సాగిన ముఖ్యమంత్రి పర్యటన ఫలితం శూన్యమని, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి జగన్ రెడ్డి తాడేపల్లి నుండి కాకినాడకు వచ్చినట్టుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, సాయి ప్రదీప్ రెడ్డి, గురు, చిన్న, సంజీవ రాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.