నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

నాగర్ కర్నూల్, 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ చేసి వందనం సమర్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా సీనియర్ నాయకులు జానీ, శ్రీరామ్ జానవత్, గోపాస్ కురుమయ్యా, పెరుమల్ల శేఖర్, కోడిగంటి సాయి, బారిగారి రాజేందర్, కిరీటి, రాజేష్ గౌడ్, సూర్య, జెరిపాటి చంద్రశేఖర్, గోపాస్ రమేష్, అన్వేష్ రెడ్డి, చందు, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.