నష్టపోయిన రైతుకు జనసేన నాయకుల ఆర్ధిక సహాయం

ఎచ్చెర్ల నియోజకవర్గం: జి సిగడాం మండలంలోని పెంట గ్రామానికి చెందిన రైతు కిల్లారి రమణ మూడున్నర ఎకరాల్లో పండించిన వరి పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం కాలి బూడిద అయిపోయింది. ఆ గ్రామంలోని జనసైనికుల ద్వారా విషయం తెలుసుకుని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు (సమన్వయకర్త) రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా. విష్వక్సేన్ మరియు సిగడాం మండల అధ్యక్షులు మీసాల రవి కుమార్ పెంట గ్రామంలో పర్యటించి రైతు రమణని కలిసి పరామర్శించడం జరిగింది. అలాగే విష్వక్సేన్ 5000/-ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. కాలిన పంటకిగాను ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా ఒత్తిడి తెస్తాం అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిగడాం మండల నాయకులు విక్రమ్ సందీప్, పైల శివ, పళ్ళెం వేణు కుమార్, కొప్పు సింహాచలం, గురవయ్యలు మరియు రొంగలి. ఈశ్వరరావు, కిల్లరి అప్పలనాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా పెంట గ్రామం జనసైనికులు మక్క సత్య సాయి బాబా, మక్క సాయి కుమార్, మక్క అంజి, మీసాల రోహిత్, మక్క అప్పల స్వామి నాయుడు, మక్కా రమినాయుడు, పతివాడ లక్ష్మణ రావు మరియు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొనడం జరిగింది.