88 వార్డ్ నరవ రెల్లి కాలనీ సమస్యలపై జనసేన నిరసన

పెందుర్తి నియోజకవర్గం: 88వ వార్డు, నర్వ గ్రామంలో రెల్లి కాలనీలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేసి స్థానిక మహిళలతో సచివాలయం అడ్మిన్ దిలీప్ గారికి ఎస్సీ సర్టిఫికెట్స్ మంజూరి, ఇళ్ల పట్టాల మంజూరి, ఇండ్లకు కొళాయిలు మంజూరి, ఇండ్లకు పన్ను మంజూరి, వీధిలైట్లు ఏర్పాటు, డ్రైనేజీ క్లీనింగ్ వంటి సమస్యలు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు గళ్ళ శ్రీనివాస్, 88 వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్. మీడియాతో మాట్లాడుతూ నరవ గ్రామంలో ఈ రెల్లి కాలనీవాసులు సమస్యలతో బాధపడుతున్న ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం మాత్రం చేయట్లేదని, స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కళ్ళు మూసుకొని ఉన్నారని, ఈరోజు మళ్లీ జగన్ ఎందుకు కావాలి, సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఉండి కూడా ప్రజలు ఇంకా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, మరొక్కసారి ప్రభుత్వాన్ని ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ లేని యెడల ప్రజల మీకు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారని రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వం కావున ఈ రెల్లి కాలనీ కావల్సిన మౌలిక సదుపాయాలు ఆన్ని మా యొక్క ప్రభుత్వంలో ఏర్పాటు చేయాడానికి కృషి చేస్తామని మాట్లాడారు, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాడిపెంటారావు, పరమేశు, జనసైనికులు మరియు కాలనీ మహిళలు పాల్గొన్నారు.