ఎస్.కోటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీనగవరపు కోట: ఎస్.కోట మండలం, తిమిడి గ్రామముజిల్లా పరిషత్ హై స్కూల్ లో రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ వబ్బిన త్రినాదమ్మ, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవీలత, జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వబ్బిన సన్యాసి నాయుడు విద్యా ర్ధుల నుద్దేశించి ప్రసంగిస్తూ భారత 74వ రాజ్యాంగ దినోత్సవ లక్ష్యాలను స్వేచ్ఛ సమానత్వ సౌబ్రత్వుత్వము సాంఘిక న్యాయము దేశ ప్రజలందరికి అందాలంటే మంచి ప్రభుత్వాలను ఓటు అనే ఆయుధంతో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి దోపిడీ చేయని పేదరికం, నిరుద్యోగ, నిరక్షరాస్యత కుల, మత, వర్గ రహిత సమసమాజ స్థాపనకు కృషి చేసిన నాయకులను పార్టీలను ఎన్నుకోవాలని. డబ్బు మాధ్యమునకు లోంగిపోకునడ ప్రజలు ఓటు అనే ఆయుదాన్ని ఉపయోగించాలని, అప్పుడే రాజ్యాంగ లక్స్యాలు నెరవేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమములో పాల్ సుధాకర్ వందన సమర్పణ చేశారు. పలువురు ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు.