జగన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడు

  • అనంతపురం రూరల్ పంచాయతి నారా లోకేష్ కాలనీలో 250 కుటుంబాలకు పట్టాలు ఇవ్వని ప్రభుత్వం అధికారులని స్థానికులు అడగగా మీ కాలనీ పేరు మార్చుకుంటే ఇస్తామని నిర్లక్ష్యపు సమాధానం
  • జగన్ ప్రచారాలకు చేసేకర్చు ఒక జిల్లా పురోగతినే మార్చేయోచ్చు
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 23వ రోజు అనంతపురం రూరల్ పంచాయితీ నారా లోకేష్ కాలనీలో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కాలనీలో దాదాపు 250 కుటుంబాల వరకు నివసిస్తున్నారని కానీ ఇక్కడ వీరికి ఇళ్ల పట్టాలు కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ లేదని స్థానికులు అధికారులను పలుమార్లు కలిసి అడిగిన వారు వైకాపా నాయకుల రాజకీయ వతిల్లతో మీ కాలనీ పేరు నారా లోకేష్ కాలనీ అని ఉందని పేరు మారుస్తెనే మీకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారని, జగన్ రెడ్డికి ప్రచారాల పిచ్చి పట్టుకుందని రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి ఎక్కడ చూసినా తన ఫోటోలే, తన పేర్లే ఉండాలని ఒక నియంతల వ్యవహరిస్తున్నాడని ఏదేమైనా జనసేన టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టగానే స్థానిక కాలనీవాసులకు పట్టాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి టీడీపీ రూరల్ పంచాయతి ఇంచార్జ్ కేశవ, నాయకులు రమణ, వేణుగోపాల్ వీర మహిళలు కళ్యాణి, సుమలత, శైలజ, గురు లక్ష్మి, సారోజమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.