ముత్తా ఆధ్వర్యంలో యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేనపార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో మత్స్యకార యువత భవిష్యత్ కోసం యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం స్థానిక 15వ డివిజన్ ఏటిమొగ ముల్లారమ్మ & ధనమ్మ గుడి ప్రాంతంలో బర్రె అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ లోగడ జూన్ 16వ తేదీన తన పర్యటనలో స్మార్ట్ ఏటిమొగ అనే నినాదంతో మా నాయకులు పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చిన సంగతి మీ అందరికీ తెలిసినదే అని దానిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందన్నారు. మరి ఇక్కడ పరిశీలిస్తే 2022వ సంవత్సరంలో స్మార్ట్ సిటి నిధులతో తలపెట్టిన ఒక శంఖుస్థాపన చూస్తున్నామనీ ఒక గోడ కట్టి సుమారు యాభై లక్షల నిధులు అయిపొయాయన్నారనీ ఇలా విస్తుపోయే నిజాలు కనపడుతున్నాయనీ ఇది కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేయడమే అని అన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక యువతకి ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేసారు. పోర్టులో మత్స్యకార యువతకి ఉపాధి కల్పించే బాధ్యత జనసేనపార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒకనాడు ఇక్కడి పేదల ఇళ్ళకోసం నాటి శాసనసభ్యులు అయిన తన తండ్రి ముత్తా గోపాలకృష్ణ సాల్ట్ కమీషన్ వారి భూమిని తీసుకుని నివాసాలని ఏర్పాటు చేయడం జరిగిందనీ, వీరి అవసరం మేరకు మరల తీసుకుని తాము ఇక్కడి వారికి ఇక్కడే కాకినాడలోనే ఇళ్ళు ఇచ్చేందుకు తగిన చర్యలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకుంటామన్నారు. రాబోయే నలభైరోజుల తరువాత జరిగే ఎన్నికలలో ఈముఖ్యమంత్రిని వై.ఎస్.ఆర్ పార్టీని దించేందుకు మేము సిద్ధం అని స్థానికులతో కలిసి నినందించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, పెమ్మడి సాంబశివ, పంతాడి సింహాద్రి, ఏ.తాతారావు, కర్రి సంతోష్, సాధనాల లోవరాజు, వాసంసెట్టి శ్రీను, వెంకటేష్, రాజశేఖర్, సాయికుమార్, రచ్చ ధనలక్ష్మి చోడీపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.