కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో మేమూ సిద్దమే

కాకినాడ సిటి: నివాస యోగ్యమైన కాకినాడ నగరాన్ని ప్రజల స్థిర నివాసానికి పనికిరాకుండా చేయడంలో కుట్రలో భాగంగానే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సుమారు 28 వేల మందిని నగర బహిష్కరణ చేసి ఇళ్ళ స్థలాల పేరుతో ఊరు దాటించారని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక మెయిన్ రోడ్డు సూపర్ బజార్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. కాకినాడ నగరంలో పన్నులు పేరుతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్ష పద్ధతిలో పీడిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార, వాణిజ్యపర సంస్ధలకు ఇష్టారీతిన పన్నులు పెంచడమే కాకుండా ప్రతీ సంవత్సరం ఆస్తిపై పన్ను శాతాన్ని 15 శాతం పెంచడం దారుణం అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రియల్ 1వ తేదిలోపు పన్నులు చెల్లింపు చేయకపోతే దానికి 2 శాతం పన్నుపై వడ్డీ వసూలు చేయడం రాష్ట్రంలో కాకినాడ నగరంలో మాత్రమే చూస్తున్నామని ఆరోపించారు. ప్రజలను, వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించే పాలన ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు మేము సిద్ధమే అన్నారు. జన సేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంటి పన్నులు వసూలు భరించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇదే విధానంగా ప్రజలను దోపిడికి గురి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగడాలు అకృత్యాలు ప్రజలకు తెలిసే విధంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, చీకట్ల శ్రీనివాస్, మనోహర్ లాల్ గుప్తా, అడబాల రాజేంద్రప్రసాద్, మిరియాల హైమావతి తదితరులు ఉన్నారు.