జర్నలిస్టులకు జనసేన-టిడిపి అండగా ఉంటుంది: రామదాస్ చౌదరి

మదనపల్లి, అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడిని ఖండిస్తు సోమవారం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన-టీడీపీ ప్రజా సంఘాల పార్టీలతో కలసి పాత్రికేయులకు మద్దతుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ తలుచుకుంటే మీ సాక్షి విలేకరులు కానీ ఫోటో గ్రాఫర్లు కానీ ఎక్కడైనా అడుగు భయట పెట్టగలరా అని జనసేన పార్టీ తరుపున ప్రశ్నించారు.పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు స్వేచ్ఛ ఉంది వారికీ నిజాలు బయటకు తీసే హక్కు వారికీ ఉందని ఒక వేల మా పైన వ్యతిరేకంగా పత్రికా విలేకరులు రాసిన వారిని మా అన్నదమ్ములుగా మిత్రులుగా చూస్తామని పత్రిక విలేకరులపై ఎవరైనా చెయ్యి వేస్తే వారిని కాపాడుకొంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ,ఉపాధ్యక్షులు చంద్రశేఖర, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, పట్టణ సెక్రటరీ పద్మావతి,పట్టణ సెక్రటరీ నాగవేణి, నిమ్మనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, రాజారెడ్డి, లవన్న, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, రూరల్ ప్రధాన పట్టణ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోటి లోకేష్,షేక్ ఫాజిల్, జనరల్ సెక్రటరీ జనార్దన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ,నరేష్, తదితరులు పాల్గొన్నారు.