ఒంటి మామిడి జంక్షన్ లో జగనన్న పాపాలు కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 41వ డివిజన్ అధ్యక్షలు వాసిరెడ్డి సత్యకుమార్ ఆధ్వర్యంలో జగనన్న పాపాలు అనే కార్యక్రమం ఒంటి మామిడి జంక్షన్ సమీపంనందు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నమ్మి ఓటేసి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ఎంతమోసపోయామో అప్పుడు తెలియటం మొదలైందని మధ్యతరగతి ప్రజలు భావించడం మొదలెట్టారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట ముఖ్యమంత్రి అయ్యాకా ఒకమాట చూసి ఈమనిషా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ప్రజలను దారుణంగా మోసం చేసింది అని ఛీకొట్టడం మొదలెట్టారన్నారు. మసి పూసి మాయచేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టాలని ఈ జగనన్న పాపాలు ప్రజలు భరించలేమంటూ వాపోతున్నారనీ, రాబోయే ఎన్నికలలో జనసేనపార్టీ తెలుగుదేశంలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, శ్రీమనారాయణ, మనోహర్ గుప్తా, సతీష్ కుమార్, ఆకుల శ్రీనివాస్, దుర్గాప్రసాద్, పలిక శివ, గంగాధర్, బ్రహ్మాజి, సుబారావు, రవిశంకర్, సుంకర రామక్రిష్ణ, రమణ, ఆకుల సత్యన్నారాయణ, రాజేంద్ర, హైమవతి, మరియా, బండి సుజాత, దీప్తి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.