పాడేరులో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం

పాడేరు, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్బంగా పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం వివిధ మండల, జిల్లా నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పాత్రికేయ మిత్రులతో సమావేశమయ్యారు ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ పాడేరు జనసేనపార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అందరూ ఒకే మాట మీద ఉన్నామని పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత నిర్ణయమే మాకు ఆమోదయోగ్యమని అందుకు అందరూ కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే నియోజక వర్గంలో జనసేనపార్టీ బలోపేతం చేశామని గిరిజన ప్రజలు జనసేనపార్టీని ఆదరిస్తున్నారన్నారు ఇప్పటికి గ్రామాల్లో పొత్తుల అంశం ప్రస్తావిస్తూ టికెట్ మీకే వస్తే బాగుంటుందని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారన్నారు. గిరిజన ప్రజలకు ఈ సందర్భంలో ఒక విన్నపం చేస్తున్నామని ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే పార్టీ నాయకులకు జీవోనెం3, బోయవాల్మీకి వివాదాస్పద అంశం, పేసా1/70 చట్టం, ఎర్రవరం పవర్ ప్రాజెక్టు అంశాలపై లిఖితపూర్వకంగా రాత ప్రతులు రాయించుకోవలన్నారు ఎందుకంటే మళ్ళీ వైసీపీ ప్రజాప్రతినిధులాగా మోసం చేయరని గ్యారెంటీ లేదన్నారు.అసలైన నాయకత్వం ఎంచుకునేందుకు గిరిజన ప్రజలు దూరదృష్టితో ఆలోచన చేయాలన్నారు. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికిచ్చిన మా అధిష్టానం నిర్ణయం మా అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతామన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో జిల్లా కిట్లంగి పద్మ, కార్యదర్శి ఉల్లి సీతారామ్, అధికార ప్రతినిధి దివ్యలత, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, మసాడి భీమన్న, బుజ్జిబాబు, లక్ష్మణ్, జిల్లా కార్యవర్గం నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.