బడేటి చంటి నామినేషన్ ను విజయవంతం చేయండి

  • టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం ఏలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.. శనివారం సాయంత్రం అమీనాపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కూటమి అభ్యర్థి బడేటి చంటి, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాం, మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న అవినీతి రాక్షస పాలన నుండి మనం విముక్తి పొందాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని కుంటుపడేలా చేసిన ఘనత ప్రస్తుత సీఎం జగన్ రెడ్డికే చెల్లిందని జగన్ పాలనలో రాష్ట్రం మరో ఐదేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.‌ ఏలూరులో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. రానన్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థుల విజయంతో దేదీప్యమానంగా వెలుగొందుతుందని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. 23 వ తేదీన ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద నుండి ప్రారంభమయ్యే కూటమి అభ్యర్థి బడేటి చంటి గారి నామినేషన్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.. అనంతరం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, నాయకులు నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, అరవింద్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, వీరమహిళలు కొసనం ప్రమీల, గాయత్రి, తుమ్మపాల ఉమా దుర్గ, గుదే నాగమణి భారీ సంఖ్యలో డివిజన్ ప్రజలు, వీరమహిళలు పాల్గొన్నారు.