ప్రజలు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు

  • కొట్టె మల్లికార్జున

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార కార్యక్రమం తుది అంకానికి చేరుకుంది. డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనసేన బిజెపి, టిడిపి, కూటమి తరుపున పోటీ చేస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం టిడిపి బిజెపి జనసేన కూటమి పొత్తు పెట్టుకున్నది. ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి రాచరిక, నియంతృత్వ పోకడలతో ప్రజా వ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన పనితీరును ప్రశ్నించే రాజకీయ నాయకులు, యువతపై కేసులు పెట్టి, వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్రాన్ని సంక్షేమం ముసుగులో అప్పుల మయం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత కక్షతో దిగజారుడు రాజకీయాలకు పూనుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అని రాజకీయ అధికార, అంగ ఆర్థిక బలాన్ని అంతా ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, అంబటి రాంబాబు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు కలలు కంటున్నారు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు మే 13న జరుగబోయే ప్రజల ఓటు హక్కు తీర్పుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, జనసేన, టిడిపి కూటమి అధికారంలోకి రాబోతుంది. ప్రజలు స్పష్టంగా తమ తీర్పును ఓటు హక్కుతో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు. బిజెపి పెద్దలు మరియు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరుపున బిజెపి యువ నాయకులుగా కూటమి తరుపున ప్రచారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కొట్టె మల్లికార్జున మీడియాతో పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తున్నారు అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమంకు సహకరించిన స్థానిక బిజెపి జనసేన టిడిపి నాయకులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసైనికులకు డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు.