పలు వినాయక మండపాలను దర్శించిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

  • పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని జై గణేశ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
  • లారీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ మహోత్సవంలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గణేష్ చతుర్థి పండుగ మహోత్సవం సందర్బంగా సోమవారం నియోజకవర్గం వ్యాప్తంగా పలు ప్రముఖ గణేష్ మండపాల్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో పలు గణపతి మండపాలను సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గణేష్‌ మండపాల్లో అనేకమంది యువత వారి కుటుంబ సభ్యులతో ఈ ఏడాది పిఠాపురంలో పండుగను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీకి విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున ప్రజలందరూ మనసారా సంతోషాలతో గడపాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాలలో జనసేన నియోజకవర్గం నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పిఠాపురంలో పలు ప్రదేశాల సందర్శించి స్థానిక టిఫిన్ సెంటర్లో కాసేపు అందరితో ఉల్లాసంగా మాట్లాడుతూ వడ్డిస్తూ షాప్ యజమానిని హత్తుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం నడుపుతున్న తీరు చాలా ఉన్నతంగా ఉందని అభినందనలు తెలియజేశారు. తరువాత పట్టణంలో సాయంత్రం లారీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక ఉత్సవాలలో ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పూజల అనంతరం లారీ యూనియన్ సభ్యులు, లారీ యజమానులు డ్రైవర్లు అందరితో ముచ్చటించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యుల సమస్యలు తెలియజేస్తూ రవాణా వాహన యజమానులు చాలా కష్టాల్లో ఉన్నారని, తమ సమస్యల తీర్చాలని పలుమార్లు సీఎం జగన్​కు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డీజిల్ రేట్లు పెంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కంటే రాష్ట్రంలో అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు.
గ్రీన్ సెస్​ను కర్ణాటకలో 200, తమిళనాడులో 500 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్​లో దారుణంగా పెంచారన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధికంగా లేబర్ సెస్, రోడ్ సెస్ వసూలు చేస్తూ.. రోడ్లు మాత్రం వేయడం లేదని ఆరోపించారు.రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉండటం వల్ల టైర్లు దెబ్బతిని నిర్వహణ వ్యయం పెరగడం వల్ల లారీలు తిప్పే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నుల బాదుడు వల్ల లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరియు పిఠాపురంలో సెజ్ పేరు చెప్పి చిక్కుల్లో పెట్టారని వాపోయారు. ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను క్షుణ్ణంగా వివరించారు. అనేక రంగాల్లో సామాన్యుడి నుంచి ప్రభుత్వం వసూలు చేసే ప్రతి పైసా ఏ విధంగా వసూలు చేస్తుందో వివరించారు. విద్యుత్ చార్జీలు గురించి మాట్లాడుతూ గతంలో ఉన్న యూనిట్ కు 4.60 పైసలు ఉండే దానిని వదులుకుని ఇప్పుడు కొత్తగా యూనిట్ 26 రూపాయలు చొప్పున కొంటున్న పద్ధతిని చూసి దేశమే ఆశ్చర్యపోతుందని మరియు లేని ఆదాయాన్ని చూపించి కొత్త అప్పులు సృష్టించి దానికి కొన్ని సంవత్సరాలు వడ్డీలు కట్టే విధానం రాష్ట్రంలో మనం చూస్తున్నామని అర్థవంతంగా వివరించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంను నమ్ముకుంటే గోచి కూడా లేకుండా చేసే పరిస్థితిలు ఏర్పడతాయని అందుకే మేము మా కుటుంబ సభ్యులు అందరం రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు.