తిరుపతి నుండి వైసీపీ పతనం ప్రారంభం

  • దొంగ ఓటర్లకు జైలు ఖాయం
  • జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన హెచ్చరిక

తిరుపతి: అభివృద్ధి పేరుతో తిరుపతి నగరంలో అవినీతి అక్రమాలకు అన్యాయాలకు దౌర్జన్యాలకు భూ కబ్జాలకు పాల్పడిన అభినయ రెడ్డి ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది వైఫల్యంతో ఇంటిదారి పట్టడం ఖాయమని, అలాగే రివర్స్ గేర్ లో పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 20 ఏళ్లు వెనక్కి అభివృద్ధి పరంగా నెట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష తప్పదని తిరుపతి నగరం లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవడంతోపాటు వైసీపీ పతనం తిరుపతి నుంచి ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన ధ్వజమెత్తారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో అభివృద్ధి పేరిట వేసిన రోడ్లన్నీ వ్యక్తిగత స్వార్థంతో ప్రజలకు ఉపయోగం లేని చోట్ల వేశారని విమర్శించారు.‌ టి డి ఆర్ బాండ్ల కుంభకోణంలోనూ అభినయ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని త్వరలోనే వారి బాగోతం బయటపడుతుందని అన్నారు. రాష్ట్రంలో దోచుకో దాచుకో అనే విధానంతో జగన్ పరిపాలన సాగిందని త్వరలోనే దీనికి ఈ ఎన్నికల్లో ప్రజలు వైసిపికి డిపాజిట్ దక్కనియకుండా చేయడం జరుగుతుందని చెప్పారు. తిరుపతిలో 38000 దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించడం ద్వారా అధికారులందరూ సస్పెండ్ అయినప్పటికీ తెర వెనుక సూత్రధారి అయిన వైసిపి నేతలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ దొంగ ఓటర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చూస్తే వైసీపీకి తగిన బుద్ధి చెప్పడానికి జనసేన ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని కీర్తన వెల్లడించారు.‌ సోమవారం జరగనున్న ఎన్నికలలో అభం, శుభం తెలియని జనం ప్రలోభాలకు తలోగ్గి. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే.. జైలు ఖాయమని వెల్లడించారు.. దోచుకో, దాచుకో, పంచుకో అనే నినాదంతో రాష్ట్రఒ మొత్తాన్ని వైసిపి దోచేసిందని ఆరోపించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి అభ్యర్థుల గెలుపు గాలులు వీస్తున్నాయని ధమా వ్యక్తం చేశారు. తమ జనసే నాని చేసిన త్యాగాలతోనే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ పాలన పగ్గాలను చేపట్టనున్నదని కొనియాడారు.ఈ సమావేశంలో
జనసేన నాయకులు హిమవంత్ పాల్గొన్నారు.