ఉగాది పర్వదినాన చింతలూరు నూకాంబికా తల్లిని దర్శించుకున్న బండారు శ్రీనివాస్

*జనసేన నేతకు డప్పు కళాకారులతో ఎంతో అట్టహాసంగా స్వాగతం పలికిన జనసైనికులు

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం, నూకాంబిక తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్, నియోజకవర్గ జనసేన రథసారధి బండారు శ్రీనివాస్ అమ్మవారిని జనసైనికులతో కలిసి దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో జనసేనానికి అండగా ఆ చల్లని తల్లి నూకాంబిక దీవెనలు ఉండాలని, అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి, ఆ చల్లని తల్లి, చంటి బిడ్డల తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, చింతలూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు దేశభక్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యం కళాకారుల సందడితో ఎంతో అట్టహాసంగా పలువురు జనసైనికులు, కార్యకర్తలుతో భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కోలాహలంగా దర్శనం జరిగింది. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ వెంట చింతలూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు దేశభక్తులు సత్యనారాయణతోపాటు, ఇటీవల బెహరన్ నుంచి వచ్చిన ప్రముఖ ఎన్నారై రాయుడు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శి సంగీత సుభాష్, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సూరప్ప రెడ్డి సత్య, జనసేన పార్టీ ప్రముఖ యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జె పి) పడాల అమ్మిరాజు, సందిపూడి సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి మహేష్, బైరి శెట్టి రాంబాబు, ఆలమూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కట్టా రాజు, జనసేన సీనియర్ నాయకులు గార్లపాటి త్రిమూర్తులు, కుడుపూడి ప్రసాద్, టేకిమూడి శ్రీనివాస్, మోటుపల్లి సతీష్, సంగీత వీరబాబు, మాకినీడి బాబీ, ముదన సాయి, పైనుమల సత్యసాయి శ్రీనివాస్, దండంగి వెంకటరమణ, పెయ్యల గణపతి, దత్తు మాల గణపతి, తాళ్లూరి రాజు, పలువురు ఎస్సి, బిసి నాయకులుతో పాటు సూర్యారావుపేట, చింతలూరు, సందిపూడి, పినపళ్ల, ఆలమూరు తోపాటు పలు గ్రామాల పలువురు జనసైనికులతో ఎంతో ఉత్సాహంతో అమ్మవారి దర్శన కార్యక్రమం జరిగినది. అనంతరం ఆలమూరు గ్రామంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ప్రారంభం సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రమును జనసైనికులతో బండారు శ్రీనివాస్ సందర్శించి వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది.