రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కరోనా కలకలం..

రాజమండ్రి: ఎపి ని కరోనా టెన్షన్‌ వెంటాడుతోంది. తూర్పు గోదావరిలోని రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కరోనా కలకలాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే తొమ్మిదిమంది ఖైదీలు కరోనా బారినపడగా.. తాజాగా మరో 13 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. దీంతో జైలు అధికారులు కరోనా సోకిన ఖైదీలకు ప్రత్యేక బ్యారెక్‌లను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నారు. జైలు సిబ్బందికి, ఇతర ఖైదీలకు కోవిడ్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం భయాందోళన కలిగిస్తోంది. కోవిడ్‌ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరాన్ని పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.