లాక్‌డౌన్‌లో ర‌హ‌స్యంగా మ‌ల‌యాళ ‘బిగ్‌బాస్’ షో షూటింగ్‌.. అడ్డుకున్న పోలీసులు

బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో సుదీప్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా వలన కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ ఏర్పాటు చేసిన కారణంగా ఈ ఏడాది జరగాల్సిన బిగ్ బాస్ షో వాయిదా పడింది. అయితే మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్ మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి నడుస్తుంది.

ఫిబ్రవరిలో మలయాళ బిగ్ బాస్ షో ప్రారంభం కాగా, ప్రస్తుతం ఈ కార్యక్రమం షూటింగ్ చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారట. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్‌ నిర్వహించడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి మంగళవారం పోలీసులతో అక్కడికి వెళ్లి షూటింగ్‌ను అడ్డుకున్నారు. సెట్‌ని సీల్ చేసి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు కెమెరామెన్లు, టెక్నీషియన్లు అందరిని పంపించేశారు. షూటింగ్‌లపై నిషేదం ఉన్నప్పటికీ ఇలా సీక్రెట్‌గా షూటింగ్ చేయడంపై నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగిన నిర్వాహకులు జూన్ 4న మలయాళ బిగ్ బాస్ ఫైనల్‌ను నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారట.