‘బీస్ట్‌’ సెట్ లో సడెన్‌గా ప్రత్యక్షం అయిన ధోని..

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ప్రస్తుతం బీస్ట్‌ సినిమా షూటింగ్‌ లో ఫుల్‌ బీజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమా పై దృష్టి పెట్టనున్నాడు హీరో విజయ్‌. అయితే.. ఇది ఇలా ఉండగా.. తాజాగా… హీరో విజయ్‌ ను సర్‌ ఫ్రైజ్‌ చేశాడు టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. చెన్నై నగరంలో హీరో విజయ్‌ ని మహేంద్ర సింగ్‌ ధోని కలిశాడు. ఈ సందర్భంగా బీస్ట్‌ సినిమా సెట్‌ ను సందర్శించాడు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. అనంతరం హీరో విజయ్‌ తో కొద్ది సేపు ఏకాంతంగా సమావేశమయ్యారు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. అయితే.. ప్రస్తుతం హీరో విజయ్‌ తో మహేంద్ర సింగ్‌ ధోని కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా.. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు.రిటైర్మెంట్​ వయసు పెంచండి: ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక