ఏపీ సచివాలయ, అసెంబ్లీ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకూ ఉన్న ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరుల్లోని ఈ కార్యలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 2021 జూన్ 31 తేదీ వరకూ ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 1, 2020తో ఉచిత వసతి సౌకర్యం గడువు ముగియటంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. రెయిన్ ట్రీపార్కులో ఉన్న 3 బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో ఆరుగురు ఉద్యోగినులు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నలుగురు చొప్పున ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ మూడు నెలలకూ పరిస్థితిని అంచనా వేసి సదరు ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.