Vijayanagaram: నేటి తరానికి ,యువతకు రాంచరణ్ ఆదర్శం – పాలవలస యశస్వి

విజయనగరం జిల్లా, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు శ్రీ రవణం స్వామి నాయుడు, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు శ్రీ పి. భవానీ రవికుమార్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవాన్ని ఆదివారం ఉదయం స్థానిక 42వ డివిజన్, కామాక్షి నగర్, శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక కామాక్షి నగర్ లో ఈమధ్యనే ఐ.ఐ.టిలో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు ఎం.జస్వంతి, సి.హెచ్.నిఖిత, ఎం.ప్రణయ్, ఉషశ్రీ లకు చిరుసత్కారాలు ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారి చేతుల మీదుగా చేయడం జరిగింది.

ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు రాంచరణ్ అని, తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో ప్రతిభైన నటనతో పాటు సేవామార్గాన్ని కూడా వారసత్వంగా తీసుకుని తన అభిమానులను సేవామార్గంలో నడిపించిన ఘనత రాంచరణ్ కు దక్కుతుందని,నేటితరానికి యువతకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆదర్శమని, మెగాభిమానులు సేవలను గూర్చి ఆమె కొనియాడారు.

కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళల, రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని, సీనియర్ ఝాన్సీ వీరమహిళ తుమ్మి లక్ష్మీ రాజ్, జనసేన పార్టీ యువనాయకులు,జిల్లా చిరంజీవి యువత ముఖ్య నాయకులుచెల్లూరి ముత్యాల నాయుడు, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్,దాసరి యోగేష్, రవిరాజ్ చౌదరి, పళ్లెం కుమారస్వామి, కనపాక శివ, సాయికుమార్ అరవింద్, సందీప్, ఈశ్వరరావు, పైడిరాజు తదితరులు హాజరయ్యారని విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) తెలిపారు.