కోవాగ్జిన్ తొలి దశ ప్రయోగాల ఫలితాలు విడుదల

భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ అనంతరం ‘కోవాగ్జిన్’ పూర్తిగా సురక్షితమని అధికారులు వెల్లడించారు. తొలి దశ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ రెండూ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.