రామచంద్రపురం డిఎస్పికి విజ్ఞాపన పత్రము అందజేసిన జనసేన

తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామ పంచాయితి జనసేన పార్టీ దళిత మహిళా సర్పంచ్ శ్రీమతి మీనాకుమారిని వైసిపి నాయకులు దుర్భాషలాడిన సంఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి, సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ మీద FIR వెయ్యకుండా, మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణపై అన్యాయంగా యస్.సి/ యస్.టి కేసు బనాయించి ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రాపురం DSP ఆఫీసు ఎదురుగా దళిత మహిళా సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దోషులపై F.I.R నమోదు చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, నియోజకవర్గాల ఇంఛార్జులు శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ మేడా గురుదత్త ప్రసాద్, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ వరుపుల తమ్మయ్య బాబు, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ మాకినీడి శేషుకుమారి, జనసేన వీరమహిళలు, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి సుంకర కృష్ణవేణి, పొlAసపల్లి సరోజ, మానస, తదితర వీరమహిళలు, జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి, తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ కార్యదర్శులు బుంగారాజు, సంపతి సత్యనారాయణ మూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శి యాళ్ళ వేణుగోపాలరావు, కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, పట్టణ 3వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు, జనసేన పార్టీ MPTC లు చిక్కాల స్వామి, సాక్షి శివక్రిష్ణ కుమార్, తాడాల జానకి రామ్, గొల్లపల్లి సింహద్రి రావు, జనసేన నాయకులు సలాది వెర్రిబాబు, మంచెం ఈశ్వరుడు, బత్తుల సూరిబాబు, తదితర నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జనసైనికులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.