కందుకూరు యధావిధిగా ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని జనసేన డిమాండ్

ఒంగోలు జిల్లా 02-02-1970న కర్నూలు నుండి మార్కాపూర్ రెవెన్యూ డివిజన్, గుంటూరు నుండి ఒంగోలు రెవెన్యూ డివిజన్ మరియు నెల్లూరు జిల్లాల నుండి కందుకూరు రెవిన్యూ డివిజను విభజించడంతో ఒంగోలు జిల్లా ఉనికిలోకి వచ్చింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్రకేసరి వినోదరాయుని వద్ద జన్మించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జ్ఞాపకార్థం 1972లో ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది. కానీ 3 దశబ్ధాలు గడిచిపోయిన ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతో మంది నాయకులు మారిన జిల్లాకి ప్రకాశమే లేకుండా పోయింది మరల ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియలో బాగంగా జిల్లాని ముక్కలు చేయబోతుంది కావున కందుకూరు ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి అని కందుకూరు డివిజన్ జేఏసి ఆధ్వర్యంలో సోమవారం కందుకూరు ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ పులి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ.. కందుకూరు గడ్డ.. అని ఎన్నో ఉద్యమాల నుండి ఏర్పడినది కందుకూరు డివిజన్ అని అన్నారు మరియు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని ఎప్పటిలానే డివిజన్ తో పాటు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి అని లేని యడల జేఏసి ఆధ్వర్యంలో ఉద్యమం చేయటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని ఆలాగే ఈ సమస్యను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి కి కూడా తీసుకువెళ్ళి అధ్యక్షులు ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేటం జారీ చేయిస్తామని అని ఒకటే నినాదం కందుకూరు యధావిధిగా ప్రకాశం జిల్లాలో కొనసాగించాలి లేదా కందుకూరు రెవెన్యూ డివిజన్ ను ఆధారంగా నూతన జిల్లాగా ప్రకటించాలి అని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని 24మండలాలు ఉన్న రెవెన్యూ డివిజన్ మా కందుకూరును నెల్లూరు పార్లమెంట్ స్థానం కింద ఉంది అనే ఒక కారణంతో నెల్లూరు జిల్లాలో కలపాలి అనుకోవడం మంచి నిర్ణయం కాదు, దీని వల్ల కందుకూరు ప్రాంతం చాలా నష్టపోతుంది భవిష్యత్తులో రామాయపట్నంపోర్టు ఏర్పాటైతే కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంటే దాని ఆదాయం నెల్లూరు జిల్లాకు చెందుతుంది కనుక వెనుకబడిన మన ప్రకాశం జిల్లాతో పాటు ఉత్తర కందుకూరు పల్లె ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది కనుక యధావిధిగా ప్రకాశం జిల్లాలోనే కొనసాగించండి లేదా రాష్ట్రంలో రెండోవ అతి పెద్ద 23 మండలాలు ఉన్న మా రెవెన్యూ డివిజన్ తోపాటు కావలి నియోజకవర్గంలోని మండలాలు కలుపుతూ నూతనంగా కందుకూరు జిల్లాను ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు మరియు జిల్లా కార్యదర్శులు మరియు జనసేన నాయకులు మనోజ్.యం(ఎం.ఎం.కె) మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.