పద్మశ్రీ పద్మజా రెడ్డి ని సన్మానించిన జనసేన

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం బేగంపేటలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళను బ్రతికిస్తున్న వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని నేటి యువత, ముఖ్యంగా మహిళా సామాజం ఆదర్శంగా తీసుకుని భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళా చైర్మన్ మండపక కావ్య, వైస్ చైర్మన్ నిహరిక, లక్ష్మీ, లిఖిత, శిరీష, పద్మజ, గ్రేటర్ సెక్రెటరీ నందగిరి సతీష్, మహేష్, రమేష్, కార్తీక్, రామకృష్ణ, నాగరాజు, పవన్, నరేష్, భారత్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.