కూల్చటంతో ప్రారంభమైన మీ ప్రస్థానం కూల్చడంతోనే అంతమవుతుంది

ఉమ్మడి అనంతపురం జిల్లా, ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అతుకుల గతుకుల రోడ్లు వాటిమీద చర్యలు లేవు. కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రతిపక్షాలకు మద్దతు తెలిపే సామాన్యుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసకర చర్యలకు పాల్పడుతోంది. ఒక గ్రామ పంచాయతీకి 120 అడుగుల రోడ్డు అవసరమా. రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటం గ్రామంలో ప్రజల ఇళ్లను కూలగొడుతోంది. కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన కారణంగా. రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల నిధులన్నీ వాడేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తుంది. వాటి మీద దృష్టి సారించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరలోనే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు మీకే భస్మాసుర హస్తంగా తయారవుతుంది. కూల్చటంతో ప్రారంభమైన మీ ప్రస్థానం కూల్చడంతోనే అంతమవుతుందని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము అన్నారు.