పట్టువదలని విశాఖ ఉక్కు సంకల్పానికి 365 రోజులు

పెడన, నేటికి విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి ఏడాది నిండింది. ఏడాదిగా కార్మికులు, నిర్వాసితులు, జనసేన పార్టీ ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరు బాట పట్టి 32 మంది బలిదానంతో ఆరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. 1963 నాటికి భారతదేశంలో నాలుగు కర్మాగారాలు ఉన్నాయి. దేశంలో మరో ఉక్కు కర్మాగారం స్థాపించాలని, అది కూడా తీరా ప్రాంతంలో ఉండాలని కేంద్రం నిర్ణయించింది. నిపుణుల కమిటీతో రిచర్చి చేసిన తర్వాత విశాఖపట్నం అందుకు సరైన ప్రాంతమని గుర్తించి విశాఖపట్నం బెటర్ అని చెప్పడం జరిగింది. అప్పుడే రాజకీయం మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రంలోని నాయకులు తమ రాష్ట్రానికి అంటే తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని పోటీ పడుతూ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాస్ నుండి విడిపోవడం జరిగింది. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్ర ప్రజలు నిరాశా నిస్పృహలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కర్మాగారని సాధించాలనే పట్టుదల ప్రతి ఆంధ్రుడు లో రెట్టింపయింది. అప్పుడే మొదలైంది ఉద్యమం “విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు” అంటూ 6 కోట్ల మంది ఆంధ్రులు ఒకతాటిపై వచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. ఆంధ్రుల దురదృష్టమో యాదృచ్ఛికమో తెలీదు కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు. ఆర్థిక పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగులు తమ జీతాల కోసం పోరాటాలు చేస్తున్నారు. అభివృద్ధి జాడలేదు పరిశ్రమల మాట లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అతి పెద్ద పరిశ్రమ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని ప్రతి ఆంధ్రుడు వ్యతిరేకిస్తున్నాడు. అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలతొ కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం పై జనసేన పార్టీ వైఖరిని స్పష్టం చేయడం జరిగింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని గట్టిగా చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కు కార్మికులకు పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభతో సంఘీభావం తెలియజేశారు. వైసిపి ప్రభుత్వ మెతక వైఖరివల్ల విశాఖ కర్మాగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 23 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ ఎ రోజు చిత్తశుద్ధితో విశాఖ ఉక్కు కర్మాగారం గురించి పోరాటం చేసింది లేదు. కేంద్రాన్ని నిలదీయలేదు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కార్మికులు, జనసేన పార్టీ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో వైసిపి ఎంపీలు కూడా భాగస్వాములై, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గొంతెత్తండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎస్.వి బాబు సమ్మెట అన్నారు.