పోలీసుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేట్టు రాజకీయనాయకులు పరుషపదజాలాన్ని వాడడం తగదు: ముఖరంచాంద్

రాజంపేట, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల తరుపున నిలబడి పోరాటాలు చేయడం రాజకీయ వ్యవస్థలో షరా మామూలే కాని అధికార పార్టీ పై ఉన్న కోపంతోనో దేశ, రాష్ట్ర రక్షణ వ్యవస్థ అయినటువంటి పోలీసులను అసభ్య పదజాలాలతో దూశించడం తగదని. గతం నుండి ఇప్పటివరకు పరిశీలిస్తే అటు వైసిపి నాయకులు ఇటు తెలుగుదేశం నాయకులు పోలీసు వ్యవస్థని వ్యక్తిగతంగా దూశిస్తూ వస్తున్నారని ఇలా చేయడం శోచనీయం అని వీటిని జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ ఖండిస్తుందని ఎట్టిపరిస్తితులలో ఇటువంటి వాటిని ప్రోత్సహించదని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్రకార్యదర్శి ముఖరంచాంద్ జనసేన పార్టీ తరుపున వెల్లడించారు.