మత్స్యకార అభ్యున్నతి సభ జయప్రదం చేయండి: శెట్టిబత్తుల రాజబాబు

తూర్పుగోదావరి, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నెల 20న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పవన్ కళ్యాణ్ పాల్గొనే మత్స్యకార అభ్యున్నతి సభను విజయవంతం చేయాలని అమలాపురం నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. అమలాపురంలో జరిగిన జనసేన కార్యకర్తలు సమావేశంలో రాజబాబు మాట్లాడుతూ 13వ తేదీ కాకినాడ సూర్యారావు పేటలో పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించే మత్స్యకార గ్రామాల సందర్శన కార్యక్రమం, 15వ తేదీన జరిగే అమలాపురం నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పురపాలక జనసేన కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవి హారిక, జనసేన పట్టణ అధ్యక్షుడు పిండి సాయిబాబా, గొలకోటి వాసు తదితరులు పాల్గొన్నారు.