జనసేన పోరాటంతోనే జోహరాపురం వంతెన నిర్మాణ పూర్తి

•జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్

కర్నూలు పాత నగరం నుండి జోహరాపురంను కలిపే వంతెన నిర్మాణం జనసేన పార్టీ పోరాటంతోనే పూర్తైనదని ఆ జిల్లా నాయకులు పవన్ కుమార్ అన్నారు. స్థానిక కర్నూల్ నగరంలోని నిర్మాణం పూర్తయిన జోహరాపురం వంతెనను జనసేన పార్టీ కర్నూలు జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ 2018లో గత టిడిపి ప్రభుత్వం హయాంలో జోహరాపురం వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటం వల్ల కర్నూలు పాత నగరం, జోహరాపురం ప్రజల ఇబ్బందులను గుర్తించిన జనసేన పార్టీ నిర్మాణ పనులు వేగవంతం కోసం పోరాడిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో జోహరాపురం వంతెన నిర్మాణం పనులపై వైసీపీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా సమస్యలు అధికారం లేకున్నా జనసేన పోరాడి పరిష్కరించిదన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని, ప్రభుత్వం ఇటీవల ప్రజలకు ఇచ్చిన జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు సతీష్, మాలిక్, మహబూబ్ బాష, చరణ్, షశావాలి, అబ్దుల్ తదితరులు పాల్గోన్నారు.