జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

కోనసీమ జిల్లా, అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ గౌరవ సలహాదారులు నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 131వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ డి.యం.ఆర్ శేఖర్ విచ్చేశారు. తొలుత ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ వాదులను దుశ్శాళువాతో సత్కరించి వారికి డా.బి.ఆర్. అంబేడ్కర్ జీవితకాల పురస్కారం అందించడం జరిగింది. వీరమహిళ భవానీ శేఖర్ 5000/- అందిచడం జరిగింది. అనంతరం సుమారు 200 మంది మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి బట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ యాళ్ళ నాగసతీష్ , రూరల్ అధ్యక్షులు లింగోలు పండు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు పడాల శ్రీదేవి నానాజీ, గొలకోటి విజయలక్ష్మి, తిక్కా రాణి ప్రసాద్, దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, ఆర్.డి.యస్ ప్రసాద్, నల్లా చిన్ని, మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, రాష్ట్ర నాయకులు నాగమానస, బట్టు పండు, వాకపల్లి వెంకటేశ్వరరావు, వాకపల్లి శ్రీను, డి ఎస్ ఎన్ కుమార్, పోలిశెట్టి బాబులు, నల్లా వెంకటేశ్వరరావు, కడియం సందీప్, పెమ్మాడి శ్రీను, మంగతాయారు, మోసుగంటి మల్లిక, కొలిశెట్టి తాతాజీ, గంధం శ్రీను, పాలూరి స్వామి, నిమ్మకాయల రాజేష్, అత్తిలి సురేష్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.