మా నాయకుడి పై వ్యక్తిగత విమర్శలు మానుకోండి: బొబ్బేపల్లి సురేష్ బాబు

వెంకటాచలం మండలం సర్వే పల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ..

ఈ రాష్ట్రంలో కొత్తగా మంత్రి పదవులు పొందిన వారిలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 500మీ.లీ పాలతో వ్యవసాయ శాఖ మంత్రిగా మంత్రి పదవిని తెచ్చుకోవడం ఎంత సులువో అనే విషయాన్ని తెలియజేశారు. అయితే మంత్రి పదవి రాగానే ఆయన కూడా జోస్యం చెప్తారని ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాలలో.. మంత్రులుగా పనిచేసిన వాళ్లు కూడా జోష్యం చెప్పుకుని కాలయాపన చేశారు. మీరు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే రాజకీయానికి పనికి వస్తారు, ఎవరైతే రాజకీయానికి పనికిరారు అనే విషయాన్ని జోస్యం చెప్పడం చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన షటిల్ టీం ముఖ్యమంత్రి కావచ్చు, అదే విధంగా ఏడు కేసులు వుండి ఎన్నికల సమయంలో పిచ్చి మందు పంచి ప్రజల ప్రాణాలు తీసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎమ్మెల్యేగా ఆయన చేసింది ఏమీ లేదు. మరి మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో దామోదరం సంజీవయ్య గారి పవర్ ప్లాంట్ ను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేసే దానికి సిద్ధం అయిపోయి.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నోరుమెదపని ఎమ్మెల్యే ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నారు, వందల ఎకరాలు రైతులు తమ బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అని చెప్పి ఈ పవర్ ప్లాంట్ కి భూములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కదా ఎంత వరకు ఆ రైతులకు న్యాయం చేస్తారు. అదేవిధంగా ఈ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా ఆపగలరా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికి వస్తారా, పనికిరారా అనే విషయాన్ని 2024లో ప్రజలే నిర్ణయిస్తారు. మీరు చెప్పిన జోస్యం మీ పార్టీకి వర్తిస్తుందో లేదో చూసుకోవాలి. అదే విధంగా ముందు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు రాజకీయాలకు పనికి వస్తారో పనికి రారో అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి దయచేసి మీరు మా అధ్యక్షుల గురించి మాట్లాడే స్థాయి మీది కాదు.. గుర్తుపెట్టుకోండి ఆయన మొన్ననే అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కవుల రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలలో ధైర్యాన్ని నింపడం జరిగింది. ఆ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం గా నిలబడి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ.. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించకండి.. రాజకీయాన్ని రాజకీయంగానే మాట్లాడండి.. నోరు అదుపులో పెట్టుకోండి లేదంటే మేము కూడా లోతుగా వెళ్లి చాలా విషయాలు మీ గురించి మీ అధ్యక్షుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండలం కార్యదర్శి సందీప్ చరణ్, మనుబోలు మండల కార్యదర్శి సాయి వంశీ తదితరులు పాల్గొన్నారు.