విలువలు లేని అనైతిక మంత్రులు సమాధానం చెప్పాలని జనసేన డిమాండ్

పాడేరు, జి.మాడుగుల మండలం జనసేనపార్టీ ప్రధాన అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ప్రజలు గమనిస్తూనే వున్నారు. పాలక వర్గాలు నైతిక విలువలు మరిచి తమదైన శైలిలో వ్యక్తి గత విమర్శలకు పదును పెట్టారు. రాజకీయాలు బహుశా చరిత్ర పరిశీలన చేసి చూస్తే ఇంతగా ఎప్పుడు దిగజారి పోలేదు. ఈ దిగజారుడుతనాన్ని వైసీపీ మంత్రులు యొక్క విలువలకు నిదర్శనం. రాష్ట్రంలో రాజధాని లేదు, ఒక వైపు సంక్షోభం ముంచుకొచ్చే పరిస్థితి, పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు, ఆడపిల్లల పై అత్యాచారాలు, గుళ్ళు గోపురాలు ధ్వంసం, నిరుద్యోగ సమస్యలు, వీటి కోసం ఆలోచన చేయని ప్రభుత్వం కేవలం మా అధినేత పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే ఇంత ప్రాధాన్యత ఇవ్వడం దేనికి సంకేతం? ప్రజల ఆలోచన తీరు పక్కదారి మల్లింపు పై ఆలోచనలు చేయడం. ఇదంతా ప్రజలు ఇట్టే నమ్మేస్తారనుకునే భ్రమలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రవాణా చార్జీల భారం, విద్యుత్ చార్జీల భారం, సామాన్యులకు దిక్కుతోచని పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే అరాచక పాలనకు మీకు మించిన ప్రభుత్వమేది లేదేమో జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఆంద్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని నిజాయితీగా పోరాడే పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి గొంది మురళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆధునిక బానిసత్వానికి గురయ్యారని వైస్సార్సీపీని గెలిపించి తమ గొయ్యి తామే తీసుకున్నారని ప్రజా పాలనపై దృష్టి పెట్టకుండా సమస్యలపై స్పందించే మా నాయకుడిని వ్యక్తిగత దుర్బషాలు మాట్లాడటం తగదని, ఏ అధికార, ప్రతి పక్షాల్లో లేకున్నా కూడా కౌలు రైతులకు తనదైన సహాయం చేస్తుంటే ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈ విమర్శలు చేస్తోందని విమర్శించారు. జనసైనికులు రమేష్ మాట్లాడుతూ ఇవాళ దేశము మొత్తం ఆంద్రప్రదేశ్ పరిస్థితి చూస్తోంది నేరస్తులకు, విలువలు లేని నాయకులకు చట్టసభల్లో పంపిస్తే వారు దోచుకోవడము కాకుండా ఏమి చేస్తారు? రాష్ట్రాన్ని దివాళా తీసేయ్యడమే వీరి ప్రధాన అజెండాగా పెట్టుకున్నారని, ప్రజలను పాలించే కనీస అర్హత లేని వ్యక్తులకు అధికారం కట్టబెడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ ప్రభావం మా లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో మరింత దయనీయంగా ఉంటుందని ఇప్పటికైనా గిరిజనులు మేల్కొని నిజాయితీ రాజకీయాలు చేసే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తోడుండాలని ప్రజా సంక్షేమం పేరిట ప్రజా సంక్షోభం సృష్టించే నవరంద్రాలు సృష్టించి రాష్ట్రాన్ని నీరుగార్చేరని, ఇక భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తారని, తిరుపతిలో రుయా ఘటన చూడండి మరి అలాంటప్పుడు ఈ అంబులెన్సుల వ్యవస్థ ఎందుకు వీటికి సమాధానం సీబీఐ దత్తపుత్రుడు, వారి పెంపుడు జాగిలాలు గుడివాడ అమర్నాద్, అంబటి రాంబాబు వంటి విలువలు లేని అనైతిక మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బహుశా వైస్సార్సీపీ ప్రభుత్వం ఎవరికైతే ఎక్కువ వ్యక్తిగత తిట్లు, బూతు భాష వస్తుందో వారికి మంత్రి పదవులు ఇస్తారేమోనంటూ దుయ్యబట్టారు.