జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా అమలాపురం నియోజకవర్గం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు స్థానిక నాయకులు, జనసేన పార్టీ నాయకులతో కలిసి పూలమాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.