తేజస్విని కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది: పత్తి చంద్రశేఖర్

*తేజస్విని ని అత్యాచారం చేసి చంపిన నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా పోరాడతాం: పత్తి చంద్రశేఖర్

ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన విద్యార్థి తేజస్విని ని మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర నాయకులు మధుసూధన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.
అనంతరం నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని.. గన్ కంటే ముందుగా జగన్ వస్తాడన్న అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుందని.. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని మహిళలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని తిరిగే పరిస్థితి దాపురించిందని జనసేన నాయకులు మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొని బాధితురాలికి అండగా నిరసన తెలపడం జరిగింది.