కొత్తపల్లి నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు!: బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా, శనివారం ఆలమూరు మండలం జనసైనికుడు కొత్తపల్లి నగేష్ పుట్టిన రోజు సందర్భంగా.. కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా ముఖ్య అనుచరుడుగా.. ఆలమూరు మండల వీర జనసైనికుడుగా కొత్తపల్లి నగేష్ కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ కుటుంబం తరఫున తెలుపుతున్నామని తెలియజేస్తూ.. ఈ సందర్భంగా కొత్తపల్లి నగేష్ సేవలు జనసేన పార్టీకి, కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండల ప్రజలకు, నిరుపేద కుటుంబాలకు, ఎంతో వెలకట్టలేనివని, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జనసైనికులు, కార్యకర్తలు, ఎంతో ఆత్మీయతతో నన్ను నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారని, ఇలాంటి పుట్టినరోజులు మా నగేష్ మరెన్నో జరుపుకోవాలని, కోరుకుంటూ.. అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉన్న యువ జనసైనికులు, కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి మా ఆశీస్సులు అందజేస్తున్నానని, నా నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు, వీర మహిళలు కార్యకర్తలు రేపు రాబోయే రోజుల్లో మరింత సహకారం నాకు అందించి నన్ను ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా కోరుతూ.. మన జనసేన పార్టీ కుటుంబం తరఫున ఆలమూరు మండల నాయకుడు కొత్తపల్లి నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని బండారు శ్రీనివాస్ అన్నారు.