రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనపై చిల్లపల్లి నాయకత్వంలో నిరసన కార్యక్రమం

మంగళగిరి: రాష్ట్రంలో రోజు రోజుకి ఆడ బిడ్డలపై వరుసగా జరుగుతున్న అత్యాచార మరియు హత్యలను అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అని ఫ్లకార్ద్స్ ప్రదర్శించారు.