గుంతకల్ జనసేనలో చేరికలు

గుంతకల్, జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై గుంతకల్ లోని పలుకాలనీలు, గ్రామాలకు చెందిన యువత సుమారు 40 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. గుంతకల్ పట్టణంలోని పలువురు యువకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర  మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వంలాంటి నిర్ణయాలునచ్చి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సమక్షంలో సుమారు 40 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన పలువురు యువకులు మరియు సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2024లో “ప్రజా ప్రభుత్వం” జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పాటు చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలను, నిస్వార్థ సేవలను, కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడిన తీరును క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన తెలిసేవిధంగా అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ సామాన్యులకు అండగా జనసేన పార్టీ ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు సంధ్య, సుజాత, ఈరమ్మ, మాధవి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, పాండు కుమార్, దాదు జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్ కృష్ణ నిస్వార్థ జనసైనికులు పామయ్య, మంజునాథ్, రమేష్ రాజ్, రవితేజ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, సంజీవ్, కొనకొండ్ల శివ, రంగా, సత్తి, శివ, తిమ్మాపురం శివ, కాజా, దాదా, మధు, సూరి, మధు, శీనా, ఆటో పాండు, కసాపురం నంద, వంశీ, ముత్తు, మంజు తదితరులు పాల్గొన్నారు.