యాజిలి నాగేశ్వరావు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన గాదె

గుంటూరు, రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో జనసేన పార్టీ నాయకులు యాజిలి నాగేశ్వరావు శుక్రవారం స్వర్గస్తులవడం జరిగింది. శనివారం ఉదయం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, చెరుకుపల్లి మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.