ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే జనసేన లక్ష్యం: రాందాస్ చౌదరి

రాయలసీమ: జనసేన పార్టీ పొత్తుల విషయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో ఎవరి నోట నైనారాజకీయ పార్టీలు పొత్తులపై ఊహాజనిత కథనాలు చర్చపై జరుగుతోందన్నారు. ఒక సీటు రాలేదని హేలన చేసిన రాజకీయ పార్టీలన్నీ నేడు జనసేన పార్టీ జపం చేస్తున్నాయిని ఏద్దేవా చేశారు. జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ పొత్తులు విషయం చర్చించి, అధినేత వద్ద తుది నిర్ణయం తెలుపుతుందని, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. వైఎస్ఆర్సిపి రాష్ట్రాన్ని అంధ కారంలోకి తీసుకు వెళ్లిందని.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇటీవల విడుదలైన 10 వ తరగతి ఫలితాలు రాష్ట్ర పరువును దేశంలో తీసివేశారన్నారు. ఎన్నికల్లో పొత్తులపై జనసేన పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలపై బురద జల్లడం జరుగుతోందని, అసంబద్ధ వ్యాఖ్యలని కంటే జనసేన దీటుగా స్పందించాల్సి ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే జనసేన లక్ష్యం అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ కేఏ. పాల్ పెద్ద జోకర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి రోజా రియల్ హీరో కాదని, రీల్ హీరో అని ఏద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి నేడు దాన్ని అటకెక్కించిందని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ నారాయణ స్వామి, మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఉపాధ్యక్షులు శంకర్, రెడ్డెమ్మ, సన్నావుల్లా, రెడ్డెప్పతో పాటు పలువురు పాల్గొన్నారు.