జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు సన్మానం మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జడ్పిటిసి ప్రతినిధి అసిరినాయుడు, మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, సూర్య, బాబురావు, శివ, సురేష్, బాలు మరియు కార్యకర్తలు వసంత్, దుర్గా ప్రసాద్, దినేష్, రాంబాబు, గోవింద, లక్ష్మణ్, అప్పలనాయుడు, మున్నా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.