పోసానిని నగర బహిష్కరణ చేయాలంటూ కె.పి.హెచ్.బి జనసైనికుల వినతిపత్రం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి పై కె.పి.హెచ్.బి (కూకట్పల్లి )చెందిన జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వచ్చి… పోసాని కృష్ణమురళి పై చర్యలు తీసుకోవాలని… పోసాని ఒక పిచ్చికుక్క లాగా ప్రవర్తిస్తున్నాడని… అతన్ని వీధిలో తిరగకుండా వెంటనే తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి నగర బహిష్కరణ చేయాలని కోరుతూ జనసైనికులు కే.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ అడ్మిన్కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కె.పి.హెచ్.బి 114 డివిజన్ కొల్లా శంకర్, 115 డివిజన్ జనసేన ప్రెసిడెంట్ హైటెక్ శ్రీనివాస్ జనసైనికులు హరీష్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.