బనగానపల్లెలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నంద్యాల జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బనగానపల్లె పట్టణంలో ఆదివారం జనసేన నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఐదు లక్షల రూపాయల బీమా అందజేయడం జరుగుతుందని కార్యకర్తల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జనసేన పార్టీ సామాన్య ప్రజల పార్టీ అని ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని దసరా నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్రను విజయవంతం చేయాలని రానున్న 2024 ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన సర్వేలో రాష్ట్రంలో 70శాతం మంది ప్రజలు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అతి కొద్దిమందికే అందుతున్నాయన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేస్తూ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తూ అండగా ఉన్నాడని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు రైతులు ఉద్యోగస్తుల చూపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉందని కచ్చితంగా 2024లో సీఎం అవ్వడం తథ్యమని అన్నారు. నాయకులు పత్తి సురేష్ మాట్లాడుతూ జన సైనికులకు అండగా ఉంటామని అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రతో రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరగడం తధ్యమని ఆకాశాన్నంటిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఇప్పుడు కొత్త నాయకత్వం వైపు చూస్తున్నారని అన్నారు. నాయకులు గుర్రప్ప, పెద్దయ్య, పృధ్వి, అజిత్ రెడ్డిలు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో పోటీ చేసి గ్రామ స్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలని దానికి యువకులంతా సిద్ధం కావాలని ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసైనికులు సిద్ధంగా ఉండాలని వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని పోటీ చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించే గుణం నేర్చుకోవాలని వారికి రావాల్సిన హక్కుల పై పోరాడే తత్వం అలవర్చుకోవాలని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన మహబూబ్, ఖాసీం, కృష్ణబాబులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూల విక్రమ్, జనార్ధన్, ఓబులేసు, కుల్లాయి, రాము, అభిలాష్, కిట్టు, సురేంద్ర, అరుణ్ సౌందరాజు, సందీప్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.