అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం, రుద్రవరం గ్రామంలో అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఇళ్లను పరిశీలించి ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించడం జరిగింది. ముప్పాల మండలం రుద్రవరం గ్రామంలో సమయంలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నాలుగు ఇళ్ళు పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయినవి. ఈ ప్రమాదంలో నాలుగు పూరీలు పూర్తిగా కాలిపోయి ఇంట్లో ఉన్న సామాగ్రి మరియు నగదు మిర్చి అమ్మగా వచ్చిన నగదు, దాదాపు ఇంట్లో ఉన్న అన్ని బూడిదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావుకి తెలియజేయగా, వెంకటేశ్వరరావు పొద్దున గ్రామాన్ని సందర్శించి ప్రమాదంలో ఇల్లు కోల్పోయారో ఆ కుటుంబాలతో మాట్లాడి వాళ్లకి జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరావు సూచనల మేరకు ముప్పాల మండల ఎమ్మార్వోని కలిసి బాధితుల కుటుంబాలను ప్రభుత్వం వారు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి వారికి పక్కా గృహాలు నిర్మించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వారు అండగా నిలబడాలని జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రమాచనద్ర ప్రసాద్, సిరిగిరి శ్రీనివాస్, రుద్రవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, దమ్మాలపాడు ఎంపిటిసి సిరిగిరి రామారావు, మాదల అధ్యక్షులు తిరుమలశెట్టి గోపి, తిరుమల శెట్టి సాంబ, శూలం రాజ్యలక్ష్మి, అంచుల ఆనేష్ , ఐలం ఆదినారాయణ, రాడ్లు శ్రీనివాసరావు, రుద్రజడ శివయ్య, సురంశెట్టి సతీష్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.