తాళ్ళరేవులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన పితాని

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం పి.మల్లవరంలో ఏర్పాటుచేసిన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేసిన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో ఉదయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ శ్రీమతి ముత్యాల జయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు అత్తిలి వీరవెంకట సత్యనారాయణ, విళ్ళ వీర, డాక్టర్ ప్రసాద్, టేకుమూడి త్రిమూర్తులు, ఎం సత్య మణికంఠ, ముత్యాల బోస్, సానబోయిన వీరభద్రరావు పాల్గొన్నారు.