వైసీపీ రాక్షసమూకని రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు

  • ప్యాకేజీ ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో చెప్పాలి
  • మంత్రులందిరికీ పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ ఇచ్చారా?
  • రాష్ట్రాన్ని శృంగారాంధ్రప్రదేశ్ చేశారు
  • మగతనం గురించి వైసీపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
  • పవన్ కళ్యాన్ దత్తపుత్రుడు కాదు వైసీపీ నాయకులకు రంకు మొగుడు
  • కుక్కల కన్నా ఘోరంగా మంత్రులు మొరుగుతున్నారు
  • మైనారిటీలకు జగన్ చేసిన అన్యాయం చరిత్రలో ఎవరూ చేయలేదు.
  • నమ్మిన ప్రతీ ఒక్కరినీ వైసీపీ మోసం చేసింది…అందులో దళితులు మొదటి వరుసలో ఉన్నారు.
  • వైసీపీ నేతల అసమర్ధ పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు
  • గడప గడపలో తన్నులు తిన్నా వైసీపీ నేతలకు బుద్ధి రావటం లేదు
  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.

గుంటూరు, తమ అసమర్ధ, అవగాహనారాహిత్య, అరాచక , అవినీతి పాలనతో వైసీపీ నేతలు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుంన్నారని, రాష్ట్రం నుంచి వైసీపీ రాక్షస మూకని ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత అసమర్ధ మంత్రివర్గాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. మంత్రులందరూ తమ శాఖలు ఏమిటో మరచిపోయారని పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖను మాత్రం సిగ్గులేకుండా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల్ని ఆదుకుంటుంటే అధికారంలో ఉన్నవారు మాత్రం చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకి జనసేన చేస్తున్న మేలు నుంచి పక్కదారి పట్టించేందుకు మంత్రులు బూతుపురాణం వల్లిస్తున్నారని ఇది సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి అసమర్ధకు ప్రతిబింభంగా మారిన మంత్రులు దమ్మూ ధైర్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ బాధ్యతల్ని మరచి ముఖ్యమంత్రి ముందు మోకాళ్ళ దండ వేసి జీ హుజూర్ అంటూ బ్రతికే మంత్రులకు పవన్ కళ్యాణ్ దమ్మూ ధైర్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏనుగు పోతుంటే కుక్కలు మోరిగినట్టుగా పవన్ కళ్యాణ్ ని చూడగానే వైసీపీ నేతలు కుక్కల కన్నా ఘోరంగా మొరుగుతున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ నేతలు కామాంధులుగా అవతారమెత్తి రాష్ట్రాన్ని కామాంధ్రప్రదేశ్ గా మార్చారని ధ్వజమెత్తారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ తన పేరుని వైయస్ అమర్నాధ్ రెడ్డిలా మార్చుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడో కాదో తెలియదు కానీ వైసీపీ నేతలకు మాత్రం రంకు మొగుడుగా మారారన్నారు. పరిపాలన మీద మాట్లాడితే వ్యక్తిగత విషయాల జోలికి వస్తున్నారని, మా సహనం నశిస్తే మేము మీ అక్రమ బెడ్ రూముల సంగతులు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై ఏ రోజన్నా ముఖ్యమంత్రిని నిలదీశావా అని ప్రశ్నించారు. దుల్హన్ పధకం పోయింది, ఇస్లాం పధకం లేదు, విదేశాల్లో ఉన్న ముస్లిం విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఒకేఒక ముస్లిం కాలేజీని అభివృద్ధి చేయలేకపోయారు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఆపలేకపోయావు అసలు నువు మైనారిటీ నాయకుడివి అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉందన్నారు. అసలు ముఖ్యమంత్రిని చూడగానే వెన్నుపూస లేని వ్యక్తుల్లా మంత్రులు ఎందుకు వంగిపోతున్నారో అర్ధం కావటం లేదన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నాయబ్ కమాల్ అన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధక్ష్యుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి త్రినాధ్, నగర కార్యదర్శి కొత్తకోట ప్రసాద్, బాలు తదితరులు పాల్గొన్నారు.