జనసేన పార్టీ తరపున పి.సువర్ణమ్మ కు పింఛను ఏర్పాటు

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ 19వ వార్డు గణేష్ నగర్ -2 పూలే అంబేద్కర్ నగర్ కొట్టాలు కు చెందిన పి.సువర్ణమ్మ (70 వయస్సు) కి పింఛన్ కు అన్ని అర్హతలు ఉన్నా కూడా పింఛను రాక ఇబ్బంది పడుతుంటే స్థానిక జనసేన పార్టీ నాయకులు బాలు చొరవ తీసుకుని పింఛను ఇప్పించేందుకు ఎన్ని ఆఫీసుల, అధికారుల దగ్గరకు, 19వ వార్డు కార్పొరేటర్ గా గెలిచి కర్నూలు మేయర్ అయినటువంటి బివై రామయ్య దగ్గరకు, ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. బాలు ఈ సమస్యను పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతా సురేష్ బాబు దగ్గరకు తీసుకొని వెళ్ళగా జనసేన పార్టీ తరపున ప్రభుత్వం నుంచి మీకు పింఛను వచ్చే వరకు జనసేన పార్టీ తరపున ఆ తల్లికి సాధారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన 2500 తో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న 1రూ జీతం కూడా కలిపి రూ 2501/- పింఛను ఇస్తుందని, రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గంలో మొదటి పింఛను మీ నుంచే మొదలు అవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి తెలుగు రాజు, జనసేన నాయకులు మంజునాథ్, బజారి, రాంబాబు, షబ్బీర్, కృష్ణ బాబు, నగేష్, శివ, చైతన్య, జనసైనికులు పాల్గొన్నారు.