గుంటూరు నుండి చినపలకలూరు వెళ్ళే మార్గంలొ రోడ్డు నిర్మాణం చేపట్టేవరకు జనసేన పోరాటం ఆగదు

గుంటూరు జిల్లా: గుంటూరు నగరం నుండి చినపలకలూరు వెళ్ళే రోడ్డు మార్గం 5కిలోమీటర్లు మేర గుంటలు పడి చెరువులను తలపించే విధంగా ఉందని, దీనివలన చదువుకునే విధ్యార్ధులకు, బ్రతుకుతెరువుకు కూలి పనుల నిమిత్తం గుంటూరు నగరానికి వెళ్లే ప్రజలకి నరకయాతన కనబడుతుంది. కావున ఈ సమస్యను సంబంధిత అధికారులకు తెలియచేసి వీలైనంత త్వరగా యుధ్ధప్రాతిప్రదికన ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని బుధవారం, గురువారం గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కి మరియు గుంటూరు రూరల్ మండల ఎం ఆర్ ఓ కి, డివిజన్ కార్పొరేటర్ కి వినతిపత్రాలు ఇవ్వటం జరిగినది. ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేవరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగదని దీనికి సంబందించిన ప్రభుత్వ అధికారులు అందరకీ వినతి పత్రాలు ఇవ్వటం జరిగినది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యడ్ల వెంకటేశ్వరరావు, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, లింగేశ్వరరావు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.