తాత్కాలిక పరిష్కారం కాదు.. శాశ్వత పరిష్కారం చేయాలి: వాసగిరి మణికంఠ

  • #GoodMorningCMSir పోరాటంతో కదిలిన యంత్రాంగం

గుంతకల్ నియోజకవర్గం, పామిడి పట్టణం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశంతో.. అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ సూచనలతో.. గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణంలో #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా జనసేన జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్, మరియు పామిడి మండలాధ్యక్షుడు యం.ధనుంజయ్ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి సమస్యలపై చేపట్టిన నిరసనలకు స్పందించి అధికారులు మరమ్మతులు చేపట్టడం మొదలుపెట్టారు.. అందుకు వారికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తాత్కాలిక పరిష్కారం కాదు శాశ్వత పరిష్కారం చేయాలని. అలాగే మిగతా సమస్యలపై కూడా సత్వరం స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని గుంతకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ డిమాండ్ చేసారు.